Showing posts with label నా కవితలు. Show all posts
Showing posts with label నా కవితలు. Show all posts

Tuesday, August 16, 2011

జాబిల్లి

నీలి మేఘాలలో దాగి ఉన్న
                             చంద్రమా!
ఉదయ భానుని కిరణాలకు
                             వీడ్కోలు చెపుతూ
నిన్ను స్వాగతిస్తున్న ధరిత్రి
                               మనవి ఆలకించి ,
నీ వెన్నెల కాంతుల చిరు జల్లులలో
                                   తడిచిపొనీ !
మంచు కొండల నుంచి జారువారే
హిమబిందువుల చల్లదనాన్ని ప్రసాదిస్తూ,
అందమైన నక్షత్రాల మధ్య
             రారాజులా ప్రకాశించే
                          ఓ జాబిలి!
     నీకిదే నా హృదయాంజలి !!

Wednesday, July 20, 2011

నిరీక్షణ

నేను నీతో గడిపిన
       మధుర క్షణాలు తలచుకుంటూ
నా మది నిండా
       నీ జ్ఞాపకాలు దాచుకుని
నివు  ఈ రోజే వస్తావనే
         చిరు ఆశతో
నీ రాకకై ఎదురు చూస్తూ
               వేచి ఉంటా !
ఈ నిరీక్షణ ఫలిస్తుందా !

కలలు

ఆకాశంలో నక్షత్రాలన్నీ
                    ఏరుకోవాలని
వెన్నెల్లో చందమామతో
                    ఆడుకోవాలని
నీటిలో  చేపపిల్లలా
                    ఈదాలని
పక్షిలా స్వేచ్చగా
                    విహరించాలని
ఈ చిన్ని జీవితంలో
                    ఎన్నెన్ని కోరికలో
సృష్టి లోని అందాలన్నీ తనివితీరా
                     ఆస్వాదించాలని ఉన్నా
వాటిని సొంతం చేసుకోవాలన్న
                   కలలు మాత్రం ఎండమావులే!!